HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Five New Features Coming Soon To Whatsapp

Whatsapp Latest: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్లు…చాటింగ్ లో సూపర్ మజా..!!

ప్రముఖ మెసేజింగ్ ఫాట్ ఫామ్ వాట్సాప్...యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. దీంతో యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరుస్తోంది.

  • Author : Hashtag U Date : 17-04-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Imresizer
Whatsapp Imresizer

ప్రముఖ మెసేజింగ్ ఫాట్ ఫామ్ వాట్సాప్…యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. దీంతో యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరుస్తోంది. ఈ ఏడాది మరిన్ని లేటెస్టు ఫీచర్లను పరిచయం చేసే దిశగా వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్స్ కు సంబంధించి వాట్సాప్ ఆకట్టుకునే ఫీచర్లను ప్రకటించింది. వేర్వేరు గ్రూప్స్ లోని మెంబర్స్ కు ఒకే చోట కమ్యూనికేట్ అయ్యేలా కమ్యూనిటీస్ ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అంతేకాదు గ్రూప్స్ కోసం అడ్మిన్ డిలీట్, లార్జ్ వాయిస్ కాల్స్, మెసేజ్ రియాక్షన్లు, లార్జ్ ఫైల్ షేరింగ్ , ఏమోజీలు అనే ఐదు కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్ ఆవిష్కరించింది.

కమ్యూనిటీస్ ఫీచర్:
కమ్యూనిటీస్ ఫీచర్ సాయంతో యూజర్లు మొత్తం కమ్యూనిటీ పంపిన అప్ డేట్లను తీసుకోవచ్చు. ముఖ్యమైన అప్ డేట్లపై స్మాల్ డిస్కషన్ గ్రూప్స్ ఆర్గనైజ్ చేయవచ్చని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ అడ్మిన్ల కోసం కొత్త టూన్స్ కూడా తీసుకురానుంది. ఇందులో అందరికీ పంపే అనౌన్స్ మెంట్ మెసేజెస్ విషయంలో ఏయే గ్రూపులను చేర్చవచ్చో అడ్మిన్లే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఫీచర్ తో స్కూళ్లు, లోకల్ క్లబ్బులు, ఇతర సంస్థలు ఒకే తాటిపైకి సులభంగా వచ్చేలా చేయాలని లక్ష్యంగా వాట్సాప్ పెట్టుకుంది. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదు.

గ్రూప్ ఫీచర్లు:
గ్రూప్ కోసం రియాక్షన్లు, అడ్మిన్ డిలీట్, ఫైల్ షేరింగ్, లార్జ్ వాయిస్ కాల్స్ అనే కొత్త ఫీచర్లను కూడా జోడిస్తుంది వాట్సాప్ .

రియాక్షన్స్:
కొత్త మెసేజ్ లతో పాటు చాట్ లను ముంచెత్తకుండా యూజర్లు తమ అభిప్రాయాలను తొందరగా షేర్ చేసుకోవడానికి వాట్సాప్ ఎమోజీ రియాక్షన్లను తీసుకొస్తోంది. అయితే మెసేజ్ కు రియాక్ట్ కావాలి అంటే గ్రూప్ లో ఎవరైనా ఒక మెసేజ్ పంపించాల్సి ఉంటుంది.

అడ్మిన్ డిలీట్ :
వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ అడ్మిషన్లను ప్రతి ఒక్కరి చాట్ నుంచి వివాదాస్పద, ఇబ్బందికర, తప్పుడు, ప్రాబ్లమ్ మెసేజ్ లను డిలీట్ చేయడానికి అనుమతి ఇస్తుంది. గ్రూప్ అడ్మిన్ వీటిని ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు.
ఫైల్ షేరింగ్:
యూజర్లు 2జీబీ వరకు సైజు ఉన్న ఫైల్స్ ను షేర్ చేసుకునేలా ఫైల్ షేరింగ్ లిమిట్ ను కూడా వాట్సాప్ ఎక్సె టెండ్ చేస్తోంది.
లార్జ్ వాయిస్ కాల్స్ :
వాట్సాప్ గతంలో 4 నుంచి 8 మందికి గ్రూప్ కాల్స్ చేసేందుకు పర్మిషన్ ఉండేది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఒకేసారి 32 మంది సభ్యులకు వాయిస్ కాల్స్ చేసేందుకు అనుమతిస్తోంది. వాయిస్ కాల్స్ ఇంటర్ ఫే్ ను కూడా వాట్సాప్ రీడిజైన్ చేసింది. ఈ ఫీచర్లు కొద్దివారాల్లోనే అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. బీటా యూజర్లు వీటిని అందరికంటే ముందే వాడొచ్చు. ఈ ఫీచర్లు మొదటగా బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాతే రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • technology
  • whatsapp

Related News

Google

గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

గూగుల్ సెర్చ్‌లో మీ వ్యక్తిగత సమాచారం లేదా ఫోటో కనిపిస్తే దాని పక్కన ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి.

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

  • Luxury Cars : అబ్బ.. ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ! చాల గ్రేట్ కదా !!

  • ‘Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

  • చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

  • కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

Trending News

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd