Gay Marriage: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్!
తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్ లో శనివారం జరిగిన ప్రైవేట్ వేడుకలో స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని అధికారికంగా చేసుకున్నారు.
- By Balu J Published Date - 03:43 PM, Mon - 20 December 21

తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్ లో శనివారం జరిగిన ప్రైవేట్ వేడుకలో స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని అధికారికంగా చేసుకున్నారు. కోల్‌కతాకు చెందిన సుప్రియో చక్రవర్తి (31), అభయ్ డాంగ్ (34) ఒక్కటయ్యారు. సుప్రియో చక్రవర్తి హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉండగా, అభయ్ ఢిల్లీలో MNC ఉద్యోగి. సుప్రియో అభయ్ ఒకటి కాకముందు ఎనిమిదేళ్ల సుదీర్ఘ సంబంధంలో ఉన్నారని చెప్పారు. ఈ జంట అక్టోబర్‌లో తమ పెళ్లిని ప్రకటించగా, డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీకి చెందిన సోఫియా డేవిడ్ ఈ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు LGBTQ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మొత్తం 60 మంది హాజరయ్యారు.