Indians: 219 మంది ఇండియన్స్ ముంబైకి తరలింపు!
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 219 మంది ఇండియన్స్
- Author : Balu J
Date : 26-02-2022 - 5:47 IST
Published By : Hashtagu Telugu Desk
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 219 మంది ఇండియన్స్ శనివారం మధ్యాహ్నం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ముంబైకి బయలుదేరిందని అధికారులు తెలిపారు. కాగా రెండో విమానం ఢిల్లీ నుండి ఉదయం 11.40 గంటలకు బయలుదేరింది సాయంత్రం 6.30 గంటలకు (భారత ప్రామాణిక కాలమానం ప్రకారం) బుకారెస్ట్ లో ల్యాండ్ అవుతుందని వారు పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న భారతీయులు ఉక్రెయిన్ దేశ రాజధానికి చేరుకున్నారు. తద్వారా వారిని ఎయిర్ ఇండియా విమానాల్లో తరలించవచ్చని చెప్పారు. మొదటి తరలింపు విమానం AI1944 బుకారెస్ట్ నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు (భారత కాలమానం ప్రకారం) బయలుదేరింది. ముంబై విమానాశ్రయంలో రాత్రి 9 గంటలకు ల్యాండ్ అవుతుందని సంబంధిత అధకారులు తెలిపారు.