Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్…!!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణ వరకే దర్యాప్తు కొనసాగుతుండగా...మంగళవారం తొలి అరెస్టు నమోదు అయ్యింది.
- Author : hashtagu
Date : 27-09-2022 - 9:42 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణ వరకే దర్యాప్తు కొనసాగుతుండగా…మంగళవారం తొలి అరెస్టు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై మొదట కేసు నమోదు చేసిన CBIఅధికారులు ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ సీఈవోగా పనిచేస్తున్న విజయ్ నాయర్ ను మంగళవారం అరెస్టు చేశారు.
ఈ సంస్థ ముంబయి కేంద్రంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ రంగంలో సేవలు అందిస్తోంది. అయితే ఈ కంపెనీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సంస్థ సీఈవోగా ఉన్న విజయ్ నాయర్ ను ఐదో నిందితుడిగా సీబీఐ అధికారులు FIRలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ నాయర్ కు చెందిన కీలక ఆధారాలు లభించడంతో సీబీఐ ఢిల్లీకి తరలించింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం మొదలైనట్లే కనిపిస్తోంది.