Fire Accident : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో భారీ అగ్నిప్రమాదం
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని మంగళ హాట్‌లో శుక్రవారం తెల్లవారుజామున
- By Prasad Published Date - 09:12 AM, Fri - 21 July 23

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని మంగళ హాట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. వస్త్ర దుకాణం సముదాయంలోని పలు హోల్‌సేల్, రిటైల్ బట్టల దుకాణాలు కాలి బూడిదయ్యాయని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియలేదని.. ప్రస్తుతం 12 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేస్తున్నట్లు తెలిపారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచానా వేస్తున్నారు.