Fire Accident : లక్నో మునిసిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం
లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌లోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో పలు వాహనాలు
- By Prasad Published Date - 08:28 AM, Fri - 24 February 23
లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌లోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్‌లోని జంక్ వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో వాటిని బయటికి తీసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ జంక్ వాహనాలకు మంటలు అంటుకోవడంతో సైట్‌లో పేలుళ్లు కూడా జరుగుతున్నాయి. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్‌తోపాటు మున్సిపల్ అధికారులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.