Fire Accident : కోల్‌కతాలోని రబ్బర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
కోల్‌కతాలోని తాంగ్రా ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోదాములోని వస్తువులు..
- By Prasad Published Date - 06:46 AM, Tue - 13 December 22

కోల్‌కతాలోని తాంగ్రా ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోదాములోని వస్తువులు దగ్ధమయ్యాయి. తొలుత స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే గోదాములో వస్తువులకు మంటలు అంటుకోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో దాదాపు 10 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ఫోరెన్సిక్ బృందం త్వరలో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనుంది. ఘటన జరిగిన ఫ్యాక్టరీ వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. డివిజనల్ అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ ఫ్యాక్టరీలో పైర్ సెప్టీకి సంబంధించి ఎలాంటి పద్ధతులు పాటించలేదని తెలిపారు. ఇరుకైన రోడ్ల కారణంగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.