fire Accident : హైదరాబాద్లో అగ్నిప్రమాదం.. వెల్డింగ్ షాపులో చెలరేగిన మంటలు
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాద సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా టోలీచౌకిలోని
- Author : Prasad
Date : 23-01-2023 - 7:27 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాద సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా టోలీచౌకిలోని హకీంపేట రోడ్డులో ఓ వెల్డింగ్ షాపులో మంటలు చెలరేగడంతో భయాందోళన నెలకొంది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పంజాగుట్ట అగ్నిమాపక కేంద్రానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పది నిమిషాల్లో మంటలను ఆర్పివేశారు. వెల్డింగ్ షాపులోని కార్మికులు పెద్ద సిలిండర్ల నుండి చిన్న సిలిండర్ల వరకు గ్యాస్ ఫైల్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సమీపంలోని రెండు ఎల్‌పీజీ సిలిండర్లు పేలిపోయాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారి తెలిపారు. అనంతరం సంఘటనా స్థలాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సందర్శించి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.