Bihar: సుల్తాన్‌గంజ్-జమాల్‌పూర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం
బీహార్ లో ఆదివారం అర్థరాత్రి తుఫాను కారణంగా సుల్తాన్‌గంజ్-జమాల్‌పూర్ మధ్య విద్యుత్ తీగ తెగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
- By Praveen Aluthuru Published Date - 08:27 AM, Mon - 15 May 23

Bihar: బీహార్ లో ఆదివారం అర్థరాత్రి తుఫాను కారణంగా సుల్తాన్‌గంజ్-జమాల్‌పూర్ మధ్య విద్యుత్ తీగ తెగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైరు తెగిపోవడంతో రైల్వే అధికారులకు సమాచారం అందడంతో పలుచోట్ల రైళ్లను నిలిపివేశారు.
విద్యుత్తు వైర్ తెగిపోవడంతో సాహిబ్‌గంజ్-భాగల్‌పూర్-జమల్‌పూర్ రైల్వే సెక్షన్‌లో తెల్లవారుజామున 2 గంటల వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రెండు నెలల క్రితం నాథ్‌నగర్ స్టేషన్ సమీపంలో విద్యుత్ వైరు తెగిపోవడంతో నాలుగు గంటలపాటు రైలు సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఆదివారం రాత్రి ఈదురు గాలులు వీయడంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబౌర్ గ్రిడ్ నుండి అన్ని సబ్ స్టేషన్లకు నిరంతరాయంగా సరఫరా ఉన్నప్పటికీ, బలమైన గాలి కారణంగా పాత చెట్లు కూలిపోయే అవకాశం, స్తంభాలు సహా తీగలు విరిగిపోయే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఫీడర్లను మూసివేసి నగరంలో విద్యుత్తును నిలిపివేశారు. ఈ సమయంలో 33,000 వోల్ట్ వైర్లు తెగిపోవడంతో అంతరాయం ఏర్పడింది.
Read More: MVA Meeting: కర్ణాటక రాజకీయ ఫార్ములా ఇతర రాష్ట్రాల్లో అవసరం: పవార్