Chandrababu Verdict: చంద్రబాబు కస్టడీ తీర్పు సా. 4 గంటలకు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే
- Author : Praveen Aluthuru
Date : 21-09-2023 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Verdict: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీర్పును ప్రకటిస్తామని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. సీఐడీ కస్టడీ పిటిషన్లపై నిన్న బుధవారం మూడు గంటల పాటు అనేక విధాలుగా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ రోజు సెప్టెంబర్ 21 గురువారం ఉదయం 11:30 గంటలకు తీర్పును ప్రకటిస్తామని ప్రకటించారు. కాగా తీర్పు సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది.
చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సిఐడి భావిస్తుంది. విచారణకు అడుగడుగునా చంద్రబాబు తరుపు న్యాయవాదులు అడ్డుపడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నిధులు ఎక్కడెక్కడికి పోయాయన్న సమాచారం ఉందని.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. చంద్రబాబు నాయుడుకు కస్టడీ ఇవ్వడం వల్ల ఎవరికీ నష్టం జరగదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. మరోవైపు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఎలాంటి కుంభకోణం జరిగినట్లు ఆధారాలు లేవని అన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని తెలిపారు.
Also Read: Hyderabad : పార్టీ లో సభ్యత్వం తీసుకుంటే..హైదరాబాద్ లో 200 గజాల స్థలం ఫ్రీ..