HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Errabelli Dayakar Rao If You Cheat Kcr Its Like Cheating Your Mother

Errabelli Dayakar Rao: కేసీఆర్ కు మోసం చేస్తే క‌న్న‌త‌ల్లికి మోసం చేసిన‌ట్లే!

కెసిఆర్ కు మోసం చేస్తే క‌న్న‌త‌ల్లికి మోసం చేసిన‌ట్లేన‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

  • Author : Balu J Date : 06-09-2023 - 5:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Errabelli Dayakar Rao Signa
Errabelli Dayakar Rao Signa

దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన 60 ఏండ్ల కాంగ్రెస్‌, 10 ఏండ్ల బిజెపి పాల‌న వ‌ల్లే మ‌న‌కీ క‌ష్టాలు దాపురించాయి. ఆ పాపాల‌ను క‌డుక్కోవ‌డానికే స‌రిపోతున్న‌ది. కేవ‌లం 10 ఏండ్ల‌ల్లోనే కెసిఆర్ సీఎం అయ్యాకే, తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అయింది. కాళేశ్వ‌రం నీటితో ప్ర‌జ‌ల కాళ్ళు క‌డిగిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఆయ‌న మ‌న‌సున్న‌మ‌హారాజు, అందువ‌ల్లే, ఆయ‌న మాన‌స పుత్రిక‌లు ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల వ‌ల్లే గ్రామాల రూపు రేఖ‌లు మారాయి! మ‌న‌కు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. మ‌న గ్రామాలు దేశానికే ఆద‌ర్శంగా నిలించాయి. అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌; గ‌్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. కాంగ్రెస్‌, బిజెపి పాలిత రాష్ట్రాల్లో మ‌న లాంటి ప‌థ‌కాలున్నాయా? అక్క‌డ చేయలేని ద‌ద్ద‌మ్మ‌లు మ‌న‌కు ఏదో చేస్తామంటే న‌మ్మాలా? ఊళ్ళ‌కు వ‌చ్చే ఆ పార్టీల నేత‌ల‌ను ఉరికిచ్చి త‌ర‌మండి అంటూ మంత్రి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇవ్వాళ కెసిఆర్ వ‌ల్లే మ‌నం ఇంత‌గా అభివృద్ధి చెందాం. కెసిఆర్ కు మోసం చేస్తే క‌న్న‌త‌ల్లికి మోసం చేసిన‌ట్లే!న‌ని వ్యాఖ్యానించారు. మా అండ‌దండ‌లు మీకు ఉంటాయి…బిఆర్ఎస్‌కు మీరు అండ‌గా నిల‌వండి అంటూ ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో రూ.27 కోట్ల రూపాయ‌ల విలువైన‌ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతోపాటు, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, క‌లెక్ట‌ర్ ప్రావీణ్య‌, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, క‌లెక్ట‌ర్ ప్రావీణ్య‌లు క‌లిసి వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం, పరకాల నియోజకవర్గంలో బుధ‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు జ‌రిపారు. సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామంలో.. రూ.3 కోట్ల 10 లక్షల విలువైన సిసి రోడ్లు, మహిళా భవనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లెప్రకృతివనం, క్రీడా ప్రాంగణాల‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే పంట నష్ట పరిహారం చెక్కులను బాధిత రైతుల‌కు అంద‌చేశారు.

అనంత‌రం సంగెం మండ‌లం కాపులకనపర్తి గ్రామంలో రూ.8 కోట్ల 18 లక్షల 30 వేల విలువైన‌ సిసి రోడ్లు, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లెప్రకృతివనం, గ్రామపంచాయతీ భవనం, రైతు వేదిక, బి.టి.రోడ్లకు ప్రారంభోత్స‌వాలు చేశారు. ఆత‌ర్వాత పంట నష్ట పరిహారం చెక్కులను బాధిత రైతుల‌కు పంపిణీ చేశారు. ఆత‌ర్వాత గవిచర్ల గ్రామంలో రూ.14 కోట్ల 19 లక్షల విలువైన‌ మహిళా భవనం, ఖబరస్థాన్ ప్రహారిగోడ, సిసి రోడ్లు, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం, గ్రామ పంచాయతీ భవనం, ఎస్సి కమ్యూనిటీ హాల్ ప్రహారిగోడ, మహిళా భవనాల‌కు ప్రారంభోత్స‌వాలు జ‌రిపారు. బి.టి.రోడ్లు, గౌడ సంఘం ప్రహారిగోడ, రజక సంఘం భవనం, సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పంట నష్టపరిహారం చెక్కులను బాధిత రైతుల‌కు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ల్లో వేర్వేరుగా రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి విజ‌న్ లేదు. ఆ పార్టీ నేత‌ల‌కు బుద్ధి లేదు, రేవంత్ రెడ్డి నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. ఈ క‌ష్టాల‌న్నింటికీ కార‌ణం కాంగ్రెసే క‌దా? 60 ఏండ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీ పాల‌న స‌రిగా లేకే ఆ పార్టీని ఏనాడో ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. 22వేల కోట్ల రుణాల‌ను మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ఘ‌న‌త‌, వారిని ఆర్థికంగా బ‌లోపేతం చేసిన ఘ‌న‌త మ‌న సీఎంకెసిఆర్ కే ద‌క్కుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. అందుకే సీఎం కెసిఆర్‌కు మ‌న‌మంతా అండ‌గా ఉండాల‌ని, ఆయ‌న‌కు అన్యాయం చేస్తే, క‌న్న‌త‌ల్లికి అన్యాయం చేసిన‌ట్లేన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి మంచి ఎమ్మెల్యే దొరికార‌ని, అభివృద్ధి కాముకుడైన చ‌ల్లా ధ‌ర్మారెడ్డి వ‌ల్లే ప‌ర‌కాల గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా అభివృద్ధి సాధించింద‌ని మంత్రి తెలిపారు. ఆయ‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని ప్ర‌జ‌ల‌కు హిత‌వు ప‌లికారు.

Also Read: MLC Kavitha: సోనియా గాంధీకి కవిత సూటి ప్రశ్న, కాంగ్రెస్ వైఖరిపై ధ్వజం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP and congress
  • cm kcr
  • errabelli dayakar rao
  • hard comments

Related News

Errabelli Dayakar Rao

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Errabelli Dayakar Rao  తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డ

  • High Tension In Thorrur Over Municipal Seat Chairman

    తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద హై టెన్షన్..

  • Thorrur Municipal Election

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd