Tamilnadu: నాటు బాంబు కొరికిన ఏనుగు.. చివరికి ఏం జరిగిందో తెలుసా?
మామూలుగా మూగజీవాలు తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని కొన్ని సార్లు వాటి ప్రాణాలు కూడా పోవచ్చు. తాజాగా అటువంటి
- By Nakshatra Published Date - 03:45 PM, Thu - 7 September 23
మామూలుగా మూగజీవాలు తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని కొన్ని సార్లు వాటి ప్రాణాలు కూడా పోవచ్చు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటుబాంబు పేలి మృతి చెందిన ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. తినేపండు అనుకొని ఆ ఏనుగు నాటుబాంబును కొరికింది. కొరికిన వెంటనే ఆ బాంబు నోటిలోనే పేలింది. తీవ్రమైన రక్తం స్రావంతో రోడ్డుమీద సహాయం కోసం పెద్ద ఎత్తున ఆరుస్తూ ఆర్తనాదాలు చేసింది. కోయంబత్తూరు ఊటి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
నాటుబాంబు నోటిలో పేలడంతో ఏమీ తినలేక ఆకలితో ఆ ఏనుగు ప్రాణాలు విడిచింది. అడవి పందులు తమ పొలాల్లోకి రాకుండా నిరోధించడానికి అవుత్తుకై అని పిలిచే నాటుబాంబును ఇక్కడి స్థానికులు పండ్లు , కూరగాయాలలో పెట్టి వుంచుతారు. ఏదైనా జంతువు దానిని కొరికినప్పుడు అది పేలి.. జంతువు నోటికి గాయాలవుతాయి. ఈ నేపథ్యంలో తడగాం అటవీ రేంజ్లోని ఇటుక బట్టీ సమీపంలో ఏనుగు సంచరిస్తోందని స్థానికులు అటవీ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అడవి పందుల కోసం వేటగాళ్లు పండుతో కలిపి కట్టినా నాటు బాంబు తినడంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది.
గజరాజు ఆ ప్రాంతంలో తిరిగిన వీడియోలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. తొండం నుంచి రక్తం కారుతుండడంతో ఆ గజరాజు రోడ్డు మీద సాయం కోసం తిరుగుతూనే ఉంది. ఇక సమాచారం అందుకున్న అధికారులు, పశువైద్య బృందం ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయంతో బాధపడుతున్న ఏనుగుకు ఇంట్రావీనస్ మందులు, గ్లూకోజ్ అందించారు. ఈ క్రమంలో నిషేధిత అవుట్టుకై అనే నాటు బాంబును ఏనుగు కొరికినట్లుగా పశువైద్య బృందం గుర్తించింది. ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏనుగు ఈ బాంబును ఎక్కడ కొరికిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. చివరకు నొప్పి భరించలేక ఏనుగు మృతి చెందింది
Related News
ISRO : ఇస్రో 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ పరీక్ష వియజవంతం
ISRO 3D Printed Rocket Engine: ఇస్రో(ISRO) మరో విజయం సొంతం చేసుకుంది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(3D printing technology) తో రూపొందించిన PS4 ఇంజిన్(Engine) యొక్క దీర్ఘ-కాల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అత్యాధునిక సంకలిత తయారీ (AM) పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి కోసం తిరిగి రూపొందించబడింది. సాధారణ పరిభాషలో 3D ప్రింటింగ్ అని కూడా పిలుస్తారు. మరియు భారతీయ పరిశ్రమ, అంతరిక్ష సంస్థలో రూపొందించబడింది. కొత్త ఇంజన్, ఇప్�