Maharashtra New CM : మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్‌షిండే
శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
- By Prasad Published Date - 08:01 PM, Thu - 30 June 22

శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్‌లో తాను ఉండబోనని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆటోడ్రైవర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఏక్‌నాథ్ షిండే 1980 దశకంలో అప్పటి శివసేన థానె అధ్యక్షుడు ఆనంద్ దిగ్జే మద్దతుతో ఆ పార్టీలో చేరారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు షిండే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్‌లో ఆయన మంత్రిగా కొనసాగారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చి శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చారు. బీజేపీ మద్దుతుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా పీఠమెక్కారు.
LIVE | Oath ceremony at Raj Bhavan, Mumbai #Maharashtra https://t.co/9hufVo6lMq
— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 30, 2022