ED Raids : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
- Author : Prasad
Date : 31-07-2022 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం సోదాలు నిర్వహిస్తున్నారు. సంజయ్ రౌత్‌కు ఈడీ అనేకసార్లు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ముంబై ‘చాల్’ రీ-డెవలప్‌మెంట్‌లో అవకతవకలు, అతని భార్య ‘అసోసియేట్సల సంబంధించిన లావాదేవీల విషయంలో మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను ఈడీ విచారణకు పిలిచింది. ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో ఉన్న ఎంపీ సంజయ్ రౌత్ ఎలాంటి తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.రాజకీయ పగతో తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.