MLA Kranti Kiran: Mlc కవితకు ఈడీ నోటీస్ ఇవ్వడం రాజకీయ కుట్ర : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం లో భాగంగానే MLC కవిత కు ఈ డీ నోటీస్ జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు.
- Author : Balu J
Date : 08-03-2023 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం లో భాగంగానే MLC కవిత కు ఈ డీ నోటీస్ జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఈ డీ ద్వారా నోటీస్ ఇప్పించింది అని క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఈ డి ల నోటీస్ లతో కవిత గారు బెదిరిపొరని ఎన్ని వేధింపులకు గురిచేసిన ప్రజా క్షేత్రాన్ని వధలరని ఆయన అన్నారు.
దేశాన్ని అడ్డికి పావుషేరులెక్క అమ్మెస్తు …. అధానికి లక్షల కోట్ల లబ్ది చేకూర్చుతు ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న మోడీ కి అమిత్ షా కు ED CBI ఎందుకు నోటీస్ ఇచ్చి ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.ఒక వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని వేధిస్తూ వారి వేధింపులను ప్రశ్నిస్తున్న కవితని టార్గెట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు సహించరని ఆయన అన్నారు.