HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Earthquake There Once Again 6 4 Intensity Recorded People Trembled

Earthquake: అక్కడ మరోసారి భూకంపం… 6.4 తీవ్రత నమోదు.. వణికిపోయిన జనం!

ఇప్పటికే భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీ-సిరియా దేశాలను ఆ తర్వాత కూడా భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. మరోసారి టర్కీ-సిరియా దేశాల

  • Author : Anshu Date : 21-02-2023 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Earthquake Again Turkey Inner
Earthquake Again Turkey Inner

Earthquake: ఇప్పటికే భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీ-సిరియా దేశాలను ఆ తర్వాత కూడా భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. మరోసారి టర్కీ-సిరియా దేశాల మధ్య భారీ భూకంపం సంభవించింది. టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల లోతులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ మేరకు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్కోలాజికల్ సెంటర్ వెల్లడించింది. తాజా భూకంపంతో మరోసారి ఈ రెండు దేశాల ప్రజలు భయంతో వణికిపోయారు.

టర్కీ, సిరియా బోర్డర్‌లోని దక్షిణ హటే ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో మరోసారి రెండు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందాగా, 213 మంది గాయపడ్డారని ఆ దేశ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. మూడు ప్రదేశాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని వెల్లడించారు.

సోమవారం రాత్రి 8.04 గంటలకు డెఫ్నే నగరంలో భూకంపం సంభవించింది. ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటక్యా,అదానా నగరాల్లో బలంగా కంపించింది. ఇది జరిగిన వెంటనే, హతాయ్‌లోని సమందాగ్ జిల్లాలోనూ మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. అల్ జజీరా నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో భవనాలు దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. దెబ్బతిన్న భవనాలు ఉన్నాయి.

తాజాగా టర్కీలో సంభవించిన భూకంపం అతలాకుతలమైన తరుణంలో ఈ భూకంపం వచ్చింది. ఫిబ్రవరి 6న టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపం శిథిలాలలో ఉన్న వ్యక్తుల కోసం అన్వేషణ, రెస్క్యూ ఆపరేషన్ ముగింపు దిశగా సాగడం ప్రారంభించింది. భూకంప ప్రభావిత 11 ప్రావిన్సుల్లో తొమ్మిది ప్రావిన్సుల్లో సహాయక చర్యలు ముగిశాయి. అదే సమయంలో టర్కీలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 40,689 కు పెరిగింది. ప్రస్తుతం కూల్చివేత బృందం శిథిలాల కుప్పను తొలగించే పనిలో నిమగ్నమై ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • again earthquake
  • earthquake
  • Turkey

Related News

earthquakes in california and nevada

Earthquake: అమెరికాలో భూప్రకంపనలు

Nevada Earthquake అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నిన్న సాయంత్రం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. నెవాడాలోని సిల్వర్ స్ప్రింగ్స్‌కు ఆగ్నేయంగా సుమారు 20 కిలోమీటర్ల దూ

    Latest News

    • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

    • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

    • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

    • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    Trending News

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd