Driver Empowerment Prog: డ్రైవర్లకు ‘కేసీఆర్’ గుడ్ న్యూస్!
తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి, సాధికారత కల్పించే దిశగా “డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్” ప్రారంభించింది.
- By Hashtag U Published Date - 02:42 PM, Wed - 18 May 22

తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి, సాధికారత కల్పించే దిశగా “డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్” ప్రారంభించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన డ్రైవర్లకు సహాయం చేయడం ఈ పథకం ప్రధాన దృష్టి. ఈ స్కీమ్ ద్వారా వాహానాలు కొనుగోలు చేసి, సొంతంగా ఉపాధి పొందవచ్చును. ఈ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ అయిన ఆటోడ్రైవర్ అయిన అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ తాను ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ పథకం నుండి వాహనాన్ని పొందానని చెప్పాడు.
“మొత్తం రూ. 3 లక్షలు, అందులో నేను రూ. 1.5 లక్షలు చెల్లించాను. మరో సగం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నేతృత్వంలోని ప్రభుత్వం చెల్లించింది. అప్పులన్నీ తీర్చేశాను. వాహనం ఇప్పుడు నాదే” అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడిన హమీద్.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నిజంగా మంచిదని, పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు.