HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Do You Know About Lic Credit Card That Card Is Profitable

LIC Credit Card: ఎల్ఐసీ క్రెడిట్ కార్డు గురించి మీకు తెలుసా.. ఆ కార్డు లాభాలివే!

ఇండియాలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ ఇప్పుడు క్రెడిట్ కార్డును ఇస్తోంది. ఎల్ఐసీ కంపెనీ ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులతో కలిసి టైఅప్ అయ్యి ఈ క్రెడిట్ కార్డులను అందిస్తోంది.

  • Author : Anshu Date : 11-01-2023 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lic Credit Card
Lic Credit Card

LIC Credit Card: ఇండియాలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ ఇప్పుడు క్రెడిట్ కార్డును ఇస్తోంది. ఎల్ఐసీ కంపెనీ ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులతో కలిసి టైఅప్ అయ్యి ఈ క్రెడిట్ కార్డులను అందిస్తోంది. దీంతో తమ యూజర్లకు ఇతర ప్రయోజనాలతో పాటు ఇన్సూరెన్స్ చెల్లించే వెసులుబాటును కూడా ఎల్ఐసీ కల్పిస్తోంది.

ఎల్ఐసీ అందిస్తున్న క్రెడిట్ కార్డులు ప్రీమియం డిపాజిట్ చేసేందుకు ఉపయోగపడటమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా పొందొచ్చు. యాక్సిస్ బ్యాంకుతో టైఅప్‌ అయిన ఎల్ఐసీ మూడు రకాల క్రెడిట్ కార్డులను తమ యూజర్లకు అందిస్తూ వస్తోంది. ఇందులో ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డు వంటివి మూడు ఉన్నాయి.

ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు యూజర్లు చెల్లించే ప్రతి వంద రూపాయలు ప్రీమియం డిపాజిట్‌కు 2 రివార్డు పాయింట్లు అందించడమే కాకుండా ఖర్చు చేసే ప్రతి వంద రూపాయలకు 1 రివార్డు పాయింట్ ను ఇస్తుంది. ఈ కార్డు వల్ల వ్యక్తిగత ప్రమాద భీమా 5 లక్షలు, యాక్సిడెంట్ కవరేజ్ 1 కోటి రూపాయల వరకూ ఉంది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ కార్డు ద్వారా లాంజ్ యాక్సెస్ పొందే అవకాశం ఉంది.

ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు ద్వారా మీరు చెల్లించే ప్రతి వంద రూపాయల ప్రీమియం డిపాజిట్‌పై 2 రివార్డు పాయింట్లు లభించడమే కాకుండా వ్యక్తిగత ప్రమాద భీమా కింద 3 లక్షలు వస్తుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ బీమా 1 కోటి రూపాయల వరకూ అందుతుంది. ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డులో కూడా చెల్లించే ప్రతి వంద రూపాయల ఎల్ఐసీ ప్రీమియం డిపాజిట్‌పై 2 రివార్డు పాయింట్లు వస్తాయి. అలాగే ప్రతి వంద రూపాయల ఖర్చులపై 1 రివార్డు పాయింట్ లభిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • LIC Credit Card

Related News

    Latest News

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

    • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

    • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

    Trending News

      • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

      • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

      • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

      • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd