TDP Challenge: జగన్ కు ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ముందా?
జగన్‌కు.. ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ముందా? అని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు.
- Author : Balu J
Date : 03-03-2023 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించిన సీఎం జగన్‌కు.. ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ముందా? అని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే దమ్ముందా అంటూ ఎద్దేవా చేశారు. వైకాపాతో పొత్తుకు ఎవరు ముందుకు రాకనే సీఎం ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. 151 మంది వైకాపా ఎమ్మెల్యేల్లో మళ్లీ ఎంత మందికి టికెట్టు ఇస్తారో జగన్ చెప్పాలన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రజలు చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని, వచ్చేది టీడీపీ పాలననే ఆయన అన్నారు.