Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.తిరుమల ఆలయం శనివారం భక్తులతో నిండిపోయింది. ఇదే రద్దీ ఈ రోజు కూడా
- By Prasad Published Date - 09:58 AM, Sun - 11 June 23
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.తిరుమల ఆలయం శనివారం భక్తులతో నిండిపోయింది. ఇదే రద్దీ ఈ రోజు కూడా కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. శనివారం 88,626 మంది భక్తులు తిరుమలను సందర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి రూ.3.29 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.