Delhi Flood Situation : ఢిల్లీని ముంచెత్తిన వరదలు
Delhi Flood Situation : ప్రభుత్వం, సహాయక బృందాలు వరద బాధితులను ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు
- By Sudheer Published Date - 03:58 PM, Thu - 4 September 25

భారీ వర్షాల కారణంగా ఢిల్లీ (Delhi) నగరం వరదల్లో చిక్కుకుంది. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వందలాది ఇళ్లు, దుకాణాలు (Flood Situation) మునిగిపోయాయి. ముఖ్యంగా మజ్ను కా టిలా, బదర్‌పూర్ వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని ఇళ్లకు నది నీరు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Ganesh : రాయదుర్గంలో భారీ ధర పలికిన గణేశ్ లడ్డూ
వరదల కారణంగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. ఎటుచూసినా నీరే కనిపించడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. వరద నీరు మార్కెట్లు, దుకాణాల్లోకి చొచ్చుకు రావడంతో వ్యాపారులు భారీ నష్టాలను చవిచూశారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా పాత రైల్వే బ్రిడ్జిని మూసివేశారు.
ప్రభుత్వం, సహాయక బృందాలు వరద బాధితులను ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నీరు నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ప్రజల సాధారణ జీవితం తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.