Crime: నల్లగొండ జిల్లాలో ఘోరం..మొండెంలేని తలను మహంకాళి అమ్మవారి..
- By hashtagu Published Date - 12:19 PM, Mon - 10 January 22

నల్లగొండ జిల్లాలోని గొల్లపల్లి గ్రామంలో ఘోరం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి తల మహంకాళి అమ్మవారి కాళ్ళ దెగ్గర కనిపించే సరికి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు శాతబడిగా అనుమానిస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు బాధితుడి దేహం వెతికే ప్రయత్నంలో ఉన్నారు. కాగా.. పోలీసుల సమాచారం మేరకు ఇటీవల బీహార్ నుండి వచ్చిన కూలీలా మధ్య వివాహేతర సంబంధం పై గొడవలు జరిగాయని.. ఆ కోణంలో కూడా కేసును విచారిస్తున్నట్టు పోలీసు శాఖ తెలిపింది. బాధితుడికి దాదాపు 35 సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా వేశారు.