PKBS vs DC: వార్నర్ రికార్డ్: పంజాబ్ పై అత్యధిక పరుగులు
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
- Author : Praveen Aluthuru
Date : 17-05-2023 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
PKBS vs DC: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరిట మరో అద్వితీయ రికార్డు నమోదైంది. వార్నర్ 25 పరుగులు చేసిన వెంటనే పంజాబ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. పంజాబ్‌పై డేవిడ్ 1100 పరుగులకు పైగా నమోదయ్యాడు. వార్నర్ 31 బంతుల్లో 46 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కాగా ఈ ఇన్నింగ్స్ లో తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. కేకేఆర్‌పై వార్నర్ 1075 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ పేరు మూడో స్థానంలో నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై శిఖర్ ధావన్ 1057 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. కేకేఆర్‌పై 1040 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ చివరి స్థానంలో ఉన్నాడు. ఢిల్లీపై కోహ్లీ 1030 పరుగులు చేశాడు.
Read More: Beedi in Plane: విమానంలో బీడీ కాల్చిన నిందితుడు. అరెస్ట్ చేసిన పోలీసులు!