Tragedy : బీహార్‌లో దారుణం.. 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం.. ఆస్పత్రికి వెళితే..!
Tragedy : బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలో పాశవిక ఘటన వెలుగుచూసింది. తొమ్మిదేళ్ల దళిత బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపిన అనంతరం ఆమెను గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించి అక్కడి నుంచే పరారయ్యాడు.
- By Kavya Krishna Published Date - 02:02 PM, Mon - 2 June 25

Tragedy : బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలో పాశవిక ఘటన వెలుగుచూసింది. తొమ్మిదేళ్ల దళిత బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపిన అనంతరం ఆమెను గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించి అక్కడి నుంచే పరారయ్యాడు. తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలికను ఆమె తల్లి హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, వైద్యుల నిర్లక్ష్యంతో అరుదైన మానవతా విషాదం చోటు చేసుకుంది. రోహిత్ సాహ్ని అనే చేపలు అమ్మే వ్యక్తి బాలికను చిరుతిళ్ల ప్రలోభంతో ఇంటి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఒక వెలవెలబోతున్న ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆమె గొంతు కోసి అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇంటికి తిరిగిరాని బాలిక కోసం తల్లి వెతికే క్రమంలో ఆమెను ఆచూకీ లభించింది. తీవ్రగాయాల మధ్య రక్తపుమడుగులో, అర్ధనగ్న స్థితిలో బాలికను కనుగొని తల్లి వెంటనే శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకెళ్లింది.
India -US : నోటీసులకు స్పందించని అగ్రరాజ్యం.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్
ఆసుపత్రికి చేరిన బాలికకు తగిన వైద్య సేవలు అందించలేదని, సుమారు 6 గంటల పాటు తల్లీదండ్రులు వైద్యులను వేడుకున్నా బెడ్ ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి బాలికను పాట్నాలోని మెడికల్ కాలేజ్‌కి తరలించినా, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. తల్లి కన్నీటి గుండెతడితో వైద్యుల నిర్లక్ష్యాన్నే తన కుమార్తె మరణానికి కారణమని వాపోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డారు. సకాలంలో వైద్యం అందించనందుకు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. “డబుల్ ఇంజిన్ సర్కార్ వైఫల్యం వల్లే బాలిక మృతి చెందింది” అని ఆరోపించారు.
ఇక ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా మట్టిలో కలిసిపోయాయంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను కఠినంగా అణచివేయాలని కోరుతున్నారు.
Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్ల’పై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు