CSK vs GT: తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై
IPL 2023 సీజన్‌లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన గుజరాజ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు
- Author : Praveen Aluthuru
Date : 23-05-2023 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
CSK vs GT: IPL 2023 సీజన్‌లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన గుజరాజ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో చెన్నై ముందుగా బ్యాటింగ్ బరిలోకి దిగింది. అయితే ఈ క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టులో మార్పు చోటుచేసుకుంది. యశ్ దయాళ్ స్థానంలో దర్శన్ నల్కండేను జట్టులోకి తీసుకున్నారు.
ఒకవైపు అనుభవజ్ఞుడైన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తుంటే మరోవైపు యువ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ధోని సేనతో తలపడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంటుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో తలపడాల్సి ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, యశ్ దయాల్, మోహిత్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, మహిష్ తీక్ష్ణ, మతిషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే.
Read More: Dhoni Cried: కన్నీరు పెట్టుకున్న ధోని