Hyderabad : మూసీలో మొసలి…చూసేందుకు ఎగబడుతున్న జనం..!!
- By hashtagu Published Date - 07:06 PM, Sat - 29 October 22

మూసీనదిలో మొసలి షాకింగ్ గురి చేసింది. హమాయత్ సాగర్, గండిపేటల నుంచి వస్తున్న వరద నీటితోపాటు మొసలి కూడా కొట్టుకొచ్చింది. మొసలిని చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూసీలో మొసలి ఉందన్న విషయం తెలుసుకున్న జనం…భారీగా తరలిస్తున్నారు. దీంతో అత్తాపూర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.