Ranchi Crime: 6 లక్షల చోరీ కేసులో రాంచీ పోలీసుల దర్యాప్తు ముమ్మరం
జార్ఖండ్ రాంచీలోని లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు
- By Praveen Aluthuru Published Date - 08:13 AM, Sat - 29 April 23

Ranchi Crime: జార్ఖండ్ రాంచీలోని లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాంచీ లాల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డిస్టిలరీ బ్రిడ్జి సమీపంలో యువకుడు రంజిత్ నుండి రూ. 6 లక్షల 20 వేలు అపహరించి బైక్‌పై పారిపోయారు దుండగులు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటన అనంతరం నేరగాళ్లిద్దరూ కోకర్ మీదుగా బూటీ మోర్ వైపు వెళ్లారని సీసీ ఫుటేజ్ లో కనిపించింది. ఆ తర్వాత పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో పోలీసులు బూటీ మోర్ నుంచి ఒర్మాంఝీ వరకు పలు చోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు పలు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఇటీవలి కాలంలో జైలు నుంచి బయటకు వచ్చిన నేరగాళ్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
కొంతమంది అనుమానిత యువకులను లాల్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంజిత్‌కు బ్యాంకు దగ్గర నుంచే రెక్కీ జరిగిందని, ఆ తర్వాత డిస్టిలరీ బ్రిడ్జి దగ్గరే నేరగాళ్లు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలంలోని కాల్ కాల్ డేటాని బయటకు తీస్తున్నారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న లాల్ పూర్ పోలీసులు పలు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తొందర్లోనే దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు.
Read More: Twilight zone: సముద్ర జీవులపై వాతావరణ ప్రభావం