India: గుజరాత్ లో 400కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్ కోస్తా తీరంలో పాకిస్థాన్ కు చెందిన ఓ నావలో 400 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి అని ఇండియన్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
- By hashtagu Published Date - 05:22 PM, Mon - 20 December 21
గుజరాత్ కోస్తా తీరంలో పాకిస్థాన్ కు చెందిన ఓ నావలో 400 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి అని ఇండియన్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆల్ హూసైనీ అనే ఫిషింగ్ బోట్ లో 77 కాగ్ హెరాయిన్ ను తరలిస్తుండగా పట్టుబయినట్లు తెలిపింది. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబరు లో 21,000 కోట్ల విలువైన 3000 kg ల డ్రగ్స్ పట్టుబడటం తెలిసిందే. గుజరాత్ పోర్టు వేదికగా పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ భారత్లోకి డ్రగ్స్ తరలిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.