Covid19 Cases: అదుపులోకి కరోనా ఉధృతి!
గడిచిన 24 గంటల్లో 11 లక్షల 79 వేల 705 నమూనాలను పరీక్షించగా..
- By Balu J Published Date - 12:45 PM, Thu - 17 February 22
గడిచిన 24 గంటల్లో 11 లక్షల 79 వేల 705 నమూనాలను పరీక్షించగా.. 30 వేల 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4 కోట్ల 26 లక్షల 31 వేల 421 కి చేరింది. ఇదే సమయంలో లక్షా 17 వేల 591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4 కోట్ల 15 లక్షల 85 వేల 711 కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.03 శాతంగా నమోదైంది.
Related News
Iyer- Kishan: అయ్యర్, ఇషాన్ కిషన్లకు మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు మరోసారి అవకాశం కల్పించింది.