Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ..!
- By HashtagU Desk Published Date - 12:07 PM, Tue - 15 March 22
ఇండియాలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 97 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4,29,96,062 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,15,974 మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు 4,24,46,171 కోట్ల మంది కరోనా నుంచి కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 33,917 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.37 శాతం ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో180 కోట్ల పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India reports 2,568 fresh #COVID19 cases & 4,722 recoveries and 97 deaths in the last 24 hours
Active case: 33,917 (0.08%)
Daily positivity rate: 0.37%
Total recoveries: 4,24,46,171
Death toll: 5,15,974 pic.twitter.com/9SFsWRCQE6— ANI (@ANI) March 15, 2022
Related News
Congenital Squint : మెల్లకన్ను ఉంటే ఎలా ? ఏం చేయాలి ?
చాలామందికి మెల్లకన్ను ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్ ఐ’ అని పిలుస్తారు.