Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
- By HashtagU Desk Published Date - 10:15 AM, Mon - 14 March 22
ఇండియాలో థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,377 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4,24,43,952 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,15,877మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు 4,24,41,449 కోట్ల మంది కరోనా నుంచి కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 36,168 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.47% శాతం ఉంది. అలాగే రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో1,79,91,57,486 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India reports 2,503 fresh #COVID19 cases & 4,377 recoveries and 27 deaths in the last 24 hours.
Active case: 36,168 (0.08%)
Daily positivity rate: 0.47%
Total recoveries: 4,24,41,449
Death toll: 5,15,877Total vaccination: 1,79,91,57,486 pic.twitter.com/7iuQySgYIG
— ANI (@ANI) March 14, 2022
Related News
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.