Corona Virus Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..!
- By HashtagU Desk Published Date - 10:33 AM, Sat - 12 March 22
భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 3,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 89 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 5,185 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4.29 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,15,803మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు 4.24 కోట్ల మంది కరోనా నుంచి కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 40,559 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.44 శాతం ఉంది. అలాగే రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో 1,79,91,57,486 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Related News
Congenital Squint : మెల్లకన్ను ఉంటే ఎలా ? ఏం చేయాలి ?
చాలామందికి మెల్లకన్ను ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్ ఐ’ అని పిలుస్తారు.