HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Corona Once Again In China 13 Thousand People Died In A Week

Corona: మరోసారి చైనాలో కరోనా విలయతాండవం.. వారంలో 13వేల మంది మృతి!

కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకు పెరుగుతుండగా..

  • Author : Anshu Date : 22-01-2023 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
220123chinacdc
220123chinacdc

Corona: కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకు పెరుగుతుండగా.. భారీగా మరణాలు పెరుగుతుండటం అందరికీ కలవరం కలిగిస్తోంది. కేవలం ఒక్క వారంలోనే చైనా దేశం మొత్తంలో ఆస్పత్రుల్లో మరణించిన వారి సంఖ్య ఏకంగా 13వేలుగా ఉండటం ప్రపంచానికి కలవరం రేపుతోంది. మరోసారి కరోనా వేవ్ రాబోతోందా అనే ఆందోళనకు గురి చేస్తోంది.

చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండగా.. అక్కడ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే నియంత్రిత విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. వేలాదిగా జనాలు రోడ్లకు మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. అయితే ఇప్పుడు ఇదే వారికి ముప్పుగా మారింది. చైనాలో ఊహించిన స్థాయి కన్నా వేగంగా కరోనా వ్యాపిస్తోంది.

గత వారం రోజుల్లో మరణించిన వారిలో 681 మంది శ్వాస వ్యవస్థ విఫలం కావడం వల్ల మరణించారని, 11977 మంది కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల వల్ల మరణించినట్లు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. జీరో కోవిడ్ ఎత్తివేసిన నెల రోజుల్లోనే 60వేల కోవిడ్ మరణాలు సంభవించడం ప్రభుత్వానికి ఇబ్బంది కరంగానూ, ఇతర దేశాలకు ఆందోళన కరంగా మారాయి.

కాగా చైనా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవులు ఇవ్వగా.. ఈ సెలవుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణాల వల్ల ఈ రిస్క్ మరింత పెరుగుతుందని, రోజుకు రోజుకు 30వేల మరణాలు సంభవించవచ్చని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి చైనాలో సంభవిస్తున్న కరోనా మరణాల లెక్కలు ప్రపంచ దేశాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • corona
  • covid19
  • Covid19 Updates

Related News

Donald Trump holds call with Xi Jinping

గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు

CHINA vs USA  ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు ని

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Latest News

  • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

  • ధూమపాన ప్రియులకు షాక్..

  • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd