Medaram: మేడారం జాతరలో విషాదం.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడె.
- By Hashtag U Published Date - 11:31 PM, Tue - 15 February 22
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడె. ఘంబీరావుపేట పోలీసులకు అటాచ్ అయిన రమేష్ మేడారం జాతర వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ప్రధాన జాతర స్థలం నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఉన్న కానిస్టేబుల్‌కు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు.అక్కడే ఉన్న వైద్యులు కానిస్టేబుల్ కి చికిత్స అందించగా మరణించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఘంబీరావుపేట ఎస్‌ఐ మహేష్‌లు హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. రమేష్ స్వస్థలం కరీంనగర్ తీగలగుట్టపల్లి. ఇటీవల జరిగిన బదిలీల్లో ఘంబీరావుపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం జాతర సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం దాదాపు 9 వేల మంది పోలీసులను మోహరించింది.