Tulasi Reddy: బ్రోకర్ పాలిటిక్స్ మానుకో పవన్..!
- Author : HashtagU Desk
Date : 15-03-2022 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. సోమవారం జనసేన ఆవిర్భవ సభలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అదే స్టైల్‌లో కౌంటర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పవన్‌పై ఫైర్ అయ్యారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం, పిట్టలదొర ప్రసంగంలా ఉందని, పవన్ ఇప్పటికైనా బ్రోకర్ పాలిటిక్స్ మానుకోవాలని తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక సభలో భాగంగా బీజేపీ రోడ్డు మ్యాప్ ప్రకారం ముందుకు పోతానని పవన్ చెప్పడం కామెడిగా ఉందని, జనసేన పార్టీకి విధి విధానాలు లేవా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. దేశానికి పట్టిన శనిగ్రహం బీజేపీతో కలిసి పనిచేయడం ఏంటి పవన్, ఇంకెందుకు జనసేనను బీజేపీలో విలీనం చేయాలన్నారు. జనసేన ఆవిర్భావ సభకు దామోదర సంజీవయ్య పేరు పెట్టుకుని, అదే ప్రాంగణం నుంచి కాంగ్రెస్ హటావో అనడం, రాహుల్ గాంధీని విమర్శించడమేమిటని తులసి రెడ్డి ప్రశ్నించారు. సొంతగా రాజకీయాలు చేసే శక్తి పవన్ కల్యాణ్ కు లేదని, బ్రోకర్ రాజకీయాలు మానుకోకపోతే, రాజకీయాల్లో పవన్ ప్యాకేజీ స్టార్‌గా మిగిలిపోతారని తులసిరెడ్డి ద్వజమెత్తారు.