CM KCR : ఇండియా టీమ్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో టీ-20...
- By Prasad Published Date - 07:19 AM, Mon - 26 September 22

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో టీ-20 మ్యాచ్ లో ఆస్టేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చివరి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో క్రీడా స్పూర్తిని ప్రదర్శించి క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ఇరు జట్ల క్రీడాకారులను సీఎం అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా మ్యాచ్ ను నిర్వహించిన క్రీడా శాఖ, పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.