CM Revanth : విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth : పోలీసు కుటుంబాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్‌లో 50% సీట్లను పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రిజర్వ్ చేయగా, మిగతా సీట్లను సివిలియన్ల పిల్లలకు కేటాయించారు
- By Sudheer Published Date - 11:26 AM, Thu - 10 April 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) విద్యా రంగంలో మరో విప్లవాత్మక అడుగు వేశారు. మంచిరేవులలో తొలి “యంగ్ ఇండియా పోలీస్ స్కూల్” (Young India Police School )ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మరియు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. CBSE సిలబస్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన చేపట్టాలని సీఎం వెల్లడించారు.
KalyanRam : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కళ్యాణ్ రామ్ , విజయశాంతి
పోలీసు కుటుంబాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్‌లో 50% సీట్లను పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రిజర్వ్ చేయగా, మిగతా సీట్లను సివిలియన్ల పిల్లలకు కేటాయించారు. ఇది సామాజిక సమానత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులకు అకాడెమిక్ మరియు ఫిజికల్ ట్రైనింగ్ రెండింటినీ సమతుల్యంగా అందించనున్నారు.
ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి, వారిలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల సరదా, స్పోర్ట్స్‌పై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను ఈ చర్య ద్వారా రుజువుచేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన స్పష్టం చేశారు.