KCR: చికిత్స కోసం ఢిల్లీకి కేసీఆర్…మోదీని కలిసే ఛాన్స్ ?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం పదిగంటలకు తన సతీమణి శోభతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ తన అనారోగ్య సమస్యలకు చికిత్స చేయంచుకోనున్నారు.
- Author : Hashtag U
Date : 30-03-2022 - 9:43 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం పదిగంటలకు తన సతీమణి శోభతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ తన అనారోగ్య సమస్యలకు చికిత్స చేయంచుకోనున్నారు.
ధాన్యం కొనుగులుపై ఇప్పటికే పలు దఫాలుగా నిరసన తెలియచేస్తున్న కేసీఆర్ త్వరలోనే కేంద్రానితో తాడో పేడో తేల్చుకుంటామని ప్రకటించారు. వరిధాన్యం అంశానికి సంబంధించి చర్చల కోసం కేసీఆర్ ఈ పర్యటనలో కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది. వీలైతే ప్రధానమంత్రి మోదీని సైతం కలుస్తారని సమాచారం.
మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని మమత బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ అంశానికి సంబంధించిన మీటింగుళ్లో కూడా కేసీఆర్ పాల్గొంటారని సమాచారం.