Signature of CM Chandrababu: సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ
Signature of CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరియు మంత్రి అచ్చెన్నాయుడు పేరుతో ఫోర్జరీ లేఖలు తయారు చేసిన ఘటన కలకలం రేపుతోంది
- By Sudheer Published Date - 09:34 AM, Sat - 12 April 25
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయం(Guthi Sub-Divisional Office) లో ఉద్యోగిగా పనిచేస్తున్న సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ (Sateesh Kumar), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరియు మంత్రి అచ్చెన్నాయుడు పేరుతో ఫోర్జరీ లేఖలు తయారు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి కేసు నమోదు చేశారు.
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్య ఇక లేరు.. ఆయన ఖ్యాతికి కారణమిదీ
గత ఏడాది ఎన్నికల సమయంలో సతీశ్ కుమార్ షేర్ మార్కెట్ పనుల్లో తలమునకలై విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై శాఖ కమిషనర్ సస్పెన్షన్ చర్యలు ప్రారంభించగా, ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఫోర్జరీకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి మరియు మంత్రుల సిఫారసులతో కూడిన తప్పుడు లేఖలు తయారుచేసి వాటిని అసలైనవిగా చూపించేందుకు యత్నించారు.
కానీ అధికారుల దృష్టికి ఈ విషయమంతా వచ్చి, విచారణలో ఫోర్జరీ స్పష్టమైన తర్వాత సతీశ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రముఖుల పేర్లు వాడి తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ఆయన చర్యలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.