Valentine Day 2022: హైదరాబాద్లో ప్రేమ జంటలకు షాక్..!
- By HashtagU Desk Published Date - 01:49 PM, Mon - 14 February 22

ఫిబ్రవరి 14 ప్రేముకుల రోజు వచ్చిదంటే చాలు, పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. మామూలు రోజుల్లోనే ప్రేమికులతో పార్కులన్నీ నిండిపోతాయి. ఇక లవర్స్ డే రోజు పార్కులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమికుల రోజున ప్రేమికులంతా పార్కుల్లోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ప్రేయసికి ఐ లవ్ యూ చెప్పేందుకు ప్రియుడు ఫాలో అవుతుంటే, పార్కుల్లో వారి వెనకాలె భజరంగ్ దళ్ కార్యకర్తలు ఎంట్రీ ఇచ్చి, ఆ ప్రేమ జంటలకు తాము పెళ్లి చేస్తామంటూ తిరుగుతుంటారు. దీంతో ఫిబ్రవరి 14న పార్కుల వద్ద అనేక సంఘటనలు దర్శనిమిస్తుంటాయి.
ఇక హైదరాబాద్‌లోని పార్కుల వద్ద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నగరంలో ప్రేమికులు సందర్శించేందుకు లెక్కలేనన్ని పార్కులున్నాయి. దీంతో ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రార్కులన్నీ ప్రేమజంటలతో నిండిపోతాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం హైదరాబాద్ పోలీసులు ప్రేమజంటలకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రేమికుల రోజు సందర్భంగా నగరంలో ప్రధాన పార్కులను పోలీసులు మూసివేశారు. వాలెంటైన్ డే సందర్భంగా పార్కుల్లో ఎలాంటి చెడు సంఘటనలు జరగకుండా ముందస్తుగా, ప్రధాన పార్కుల్ని పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో హైదారాబాద్‌లో లవర్స్‌కు అడ్డా అయిన ఇందిరా పార్కును ముందుగా పోలీసులు మూసివేశారు. అంతేకాకుండా అయా పార్కుల వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు.