Chiru Back: బాస్ ఈజ్ బ్యాక్.. వీడియో వైరల్!
‘ఆచార్య’ విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెకేషన్‌కు వెళ్లారు.
- By Balu J Published Date - 07:30 PM, Sat - 4 June 22

‘ఆచార్య’ విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెకేషన్‌కు వెళ్లారు. ఆచార్య ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే వరుస షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిరంజీవి చాలా రోజుల తర్వాత తన భార్యతో కలిసి టూరుకెళ్లాడు. యుఎస్, యుకెలలో నెలరోజుల పాటు సరాదాగా గడిపాడరు. ఈ హాలిడే నుంచి చిరంజీవి రిఫ్రెష్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యాడు. చిరంజీవి కూడా కొత్త స్క్రిప్ట్‌లు వెతుకుతున్నారు. ‘ఆచార్య’ పరాజయం తర్వాత చిరంజీవి ఎలాంటి సినిమాల విషయంలో జాగ్రత్తలు వహించే అవకాశం ఉంది.
Boss is Back ❤️🔥 pic.twitter.com/8VjbuBp9Bn
— SivaCherry (@sivacherry9) June 3, 2022