Chiru: నేచర్ తో చిరు మమేకం.. ఇన్ స్టాలో వీడియో షేర్!
మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయన డాక్టర్ల సూచన మేరకు హోంక్వారంటైన్ అయ్యారు.
- By Balu J Published Date - 04:45 PM, Sun - 30 January 22

మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయన డాక్టర్ల సూచన మేరకు హోంక్వారంటైన్ అయ్యారు. ఒకవైపు కొవిడ్ నుంచి కోలుకుంటూనే.. తనదైన శైలిలో గడుపుతున్నారు. నేచర్ తో గడుపుతూ సూర్యుడి ఫొటోను తన కెమెరాలో బంధించారు. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ‘‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది’’ అంటూ రియాక్ట్ అయ్యారు.