Nuclear Weapons Race : చైనాకు మరో 60 అణ్వాయుధాలు.. ఇండియా, పాక్ సంగతేంటి ?
Nuclear Weapons Race : మళ్లీ ప్రపంచదేశాల మధ్య అణ్వాయుధ పోటీ మొదలైంది. ఈ రేసులో చైనా దూసుకుపోతోంది.. గత ఏడాది వ్యవధిలో చైనా కొత్తగా 60 అణ్వాయుధాలను తయారు చేసుకుందట.ఇక ఇండియా, పాక్, అమెరికా సంగతేంటో చూద్దాం..
- By Pasha Published Date - 09:54 AM, Mon - 12 June 23

Nuclear Weapons Race : మళ్లీ ప్రపంచదేశాల మధ్య అణ్వాయుధ పోటీ మొదలైంది.
ఈ రేసులో చైనా దూసుకుపోతోంది..
గత ఏడాది వ్యవధిలో చైనా కొత్తగా 60 అణ్వాయుధాలను తయారు చేసుకుందట.
ఇక ఇండియా, పాక్, అమెరికా సంగతేంటో చూద్దాం..
గత సంవత్సర కాలంలో చైనాతో పాటు రష్యా, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా దేశాలు కూడా న్యూక్లియర్ ఆయుధాల సంఖ్యను పెంచుకున్నాయి. రష్యా 12, పాకిస్థాన్ 5, ఉత్తర కొరియా 5, భారత్ 4 అణ్వాయుధాలను కొత్తగా సమకూర్చుకున్నాయి. ఈమేరకు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఒక రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. రష్యా, భారత్, పాకిస్థాన్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో న్యూక్లియర్ ఆయుధాలను చైనా(Nuclear Weapons Race) పెంచుకుంటోంది. ప్రస్తుతం మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర కలుపుకొని 12,512 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 86 ఈ ఏడాదే తయారయ్యాయి. ప్రపంచ దేశాల మధ్య మరోసారి అణ్వాయుధాల తయారీ పోటీ పెరుగుతోందని SIPRI నివేదిక పేర్కొంది. ప్రస్తుత ప్రపంచం మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర దశలో ఉందని వ్యాఖ్యానించింది. ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు క్షీణించడం వల్ల అణ్వాయుధాల తయారీ పెరిగిందని విశ్లేషించింది.
Also read : Russia Atomic Warfare : నీటమునిగిన రష్యా అణ్వాయుధాలు..?
ప్రపంచంలోని 90% అణ్వాయుధాలు రష్యా, అమెరికా వద్దే..
ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 90% రష్యా, అమెరికా దేశాల దగ్గరే ఉన్నాయి. SIPRI నివేదిక ప్రకారం.. రష్యా వద్ద 4489, అమెరికా వద్ద 3708, చైనా వద్ద 410, ఫ్రాన్స్ వద్ద 290, బ్రిటన్ వద్ద 225, భారత్ వద్ద 164 అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా, రష్యా తక్షణ ఉపయోగం కోసం దాదాపు 2,000 అణ్వాయుధాలను హై అలర్ట్‌లో ఉంచాయి. అంటే, ఈ ఆయుధాలు క్షిపణుల్లో.. ఎయిర్ బేస్ లలో మోహరించి రెడీగా ఉంటాయి.
భారత్, పాకిస్థాన్‌ల పరిస్థితి ఏమిటి?
అణ్వాయుధాల విషయంలో భారత్ కంటే పాకిస్థాన్ ముందుందని SIPRI నివేదిక పేర్కొంది. దాని వద్ద 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. భారత్ వద్ద 164 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద 30 అణ్వాయుధాలు ఉన్నాయి.