CJI: కనకదుర్గమ్మ సేవలో జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు!
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు.
- By Balu J Published Date - 03:18 PM, Sat - 25 December 21

ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పేర్ని వెంకటరామయ్య (నాని) స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈ ఓ భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితుల చే వెంకటరమణ దంపతులు లకు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని , తీర్ధ,ప్రసాదాలను అందజేశారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వెంట ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ , తెలంగాణా హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా హైకోర్ట్ రిజిస్ట్రార్లు , విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.