Cheddi Gang: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్, మరోసారి భారీ చోరీ
- By Balu J Published Date - 06:49 PM, Mon - 18 March 24

Cheddi Gang: హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఇప్పటికే ఎన్నో చోరీలు చేసినా ఈ గ్యాంగ్ మళ్లీ సిటీలో అలజడి రేపారు. సిటీలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి వరల్డ్ వన్ స్కూల్ లో చోరీ చేశారు. స్కూల్ కౌంటర్ లో ఉంచిన 7 లక్షల 85 వేల నగదును చెడ్డీ గ్యాంగ్ ముఠా దోచుకెళ్లింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్కూల్ లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. మియపూర్ సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మీడియా సమావేశంలో చెడ్డి గ్యాంగ్ అప్డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు.
సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 16న ఓ స్కూల్‌లో అర్ధరాత్రి చోరీ జరిగిందని ఫిర్యాదు వచ్చింది. వారి వేషధారణ అంతా చెడ్డి గ్యాంగ్‌లా ఉన్నారు. స్కూల్ లోని కౌంటర్‌లోకి చొరబడి రూ.7 లక్షల 85 వేల నగదును దోచుకెళ్లారుదొంగతనం దృశ్యాలు స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ఒంటిమీద బట్టలు లేకుండా చెడ్డీలతో దొంగలు వచ్చారు. మొత్తం ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. స్కూలు యాజమాన్యం లో పనిచేసే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అని కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. నిందితుల కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాని అన్నారు.