Delhi Teen Murder: ఢిల్లీ మైనర్ హత్య కేసులో నిందితుడు సాహిల్‌పై చార్జ్ షీట్
మే 28న దేశ రాజధానిలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. 16 ఏళ్ళ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి
- Author : Praveen Aluthuru
Date : 28-06-2023 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Teen Murder: మే 28న దేశ రాజధానిలో జరిగిన అత్యా ఘటనపై పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. 16 ఏళ్ళ బాలికను అత్యంత పాశవికంగా పొడిచి చంపిన సాహిల్‌పై ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. బాలికపై దాదాపుగా 20 కత్తిపోట్లు జరిపాడు. దీంతో పోక్సోలోని సెక్షన్ 12 , షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టంలోని సెక్షన్ల కింద 640 పేజీల ఛార్జిషీటును పోక్సో కోర్టులో దాఖలు చేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. నిందితుడిపై IPC సెక్షన్లు 302 (హత్య), 354 A (లైంగిక వేధింపులకు శిక్ష) మరియు 509 అభియోగాలు మోపారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల తర్వాత సాహిల్‌ను జూన్ 1న ఢిల్లీకి తీసుకొచ్చారు. మరుసటి రోజు డ్యూటీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.ఇదిలా ఉండగా సిసిటివి ఫుటేజీలో నిందితుడు బాలికపై కత్తితో 20 సార్లు పొడిచి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశాడు. ఆమె శరీరంపై 34 గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె తల పగలగొట్టి చంపేశాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసును జులై 1న ప్రత్యేక పోక్సో కోర్టు చార్జిషీట్‌ను విచారించే అవకాశం ఉంది.
Read More: Weak Up Early: వామ్మో.. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?