Chandrababu: కార్యకర్త కోసం స్ట్రీరింగ్ పట్టిన బాబు!
తెలుగుదేశం పార్టీకి సారథి ఆయన. ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలను వెలుగుబాటలోకి నడిపించిన ప్రగతి రథసారథి ఆయన.
- By Balu J Published Date - 12:02 PM, Thu - 17 February 22

తెలుగుదేశం పార్టీకి సారథి ఆయన. ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలను వెలుగుబాటలోకి నడిపించిన ప్రగతి రథసారథి ఆయన. అటువంటి మార్గనిర్దేశకుడు తన కారు స్టీరింగ్ మీద చెయ్యేస్తే ఎంత భాగ్యమో కదా! ఒక తెలుగుదేశం కార్యకర్త అచ్చంగా ఇలాగే కోరుకున్నాడు. అధినేత కూడా కాదనక నెరవేర్చారు. కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటకు చెందిన తెలుగుదేశం కార్యకర్త వేణు, తాను కొనుగోలు చేసిన కొత్త కారును తన అభిమాన ప్రజా నాయకుడు చంద్రబాబుగారితో ప్రారంభింపచేయాలని కోరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్దకు కొత్త కారును తెచ్చి అధినేత చంద్రబాబుగారు రాగానే తన మనసులోని మాటను చెప్పాడు. అభిమాని కోరికను మన్నించిన చంద్రబాబుగారు ఇదిగో ఇలా డ్రైవింగ్ సీట్లో కూర్చుని పార్టీ కార్యకర్త కోరికను తీర్చారు. అక్కున చేర్చుకుని ప్రోత్సహించారు. పార్టీ కార్యకర్తల కోసం తాను ఎన్ని మెట్లు అయినా దిగివచ్చేందుకు సిద్ధం అని చెప్పకనే చెప్పారు.