CBN Birthday : CBN బర్త్ డే సందర్బంగా సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు , పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు
- By Sudheer Published Date - 10:54 AM, Sat - 20 April 24

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. నేడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా తెలుగు ప్రజలు, టీడీపీ అభిమానులు , నందమూరి అభిమానులు ఇలా అనేక వర్గాల వారు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున పలు సేవ కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే CBNbirthday ట్రెండ్ అవుతూ వస్తుంది. సినీ , రాజకీయ ప్రముఖులంతా చంద్రబాబు కు బెస్ట్ విషెష్ ను అందిస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు , పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక ఏపీలో టీడీపీ శ్రేణులు ఉదయం నుండే బర్త్ డే వేడుకలు చేస్తూ వస్తున్నారు. అతి త్వరలో ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో అడ్వాన్స్ గా ఆయనకు విన్నింగ్ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ వస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఏమి చోటుచేసుకోలేదని, ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్న బాబు అభిమానులు. #ChandrababuNaidu #birthday pic.twitter.com/pQrbke3HFr
— Hashtag U (@HashtaguIn) April 20, 2024
Read Also : Beer Sales in Telangana : తెలంగాణలో 18 రోజుల్లో 23 లక్షల కేసుల బీర్లు తాగేశారు