Lizard in Upma: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉప్మాలో బల్లిపై కేంద్రం సీరియస్
తెలంగాణ మోడల్ స్కూల్‌లోని ఉప్మాలో బల్లి కనిపించిందని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి, భారత ప్రభుత్వ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది
- By Praveen Aluthuru Published Date - 09:51 AM, Fri - 12 July 24

Lizard in Upma: మెదక్‌లోని రామాయంపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో బల్లి కనిపించిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
తెలంగాణ మోడల్ స్కూల్‌లోని ఉప్మాలో బల్లి కనిపించిందని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి, భారత ప్రభుత్వ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ హాస్టల్‌లో జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా సంబంధిత అధికారులపై తాము సీరియస్‌గా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
పీఎం పోషణ పథకం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుందని మరియు భద్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి మరియు విద్యార్థులకు సరైన ఆహారాన్ని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
ఈ వారం ప్రారంభంలో ఉప్మా తిని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో కనీసం ముప్పై నుంచి నలభై మంది అదే ఆహారం తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం అల్పాహారం కోసం తయారు చేసిన ఉప్మాలో బల్లి పడింది. 30-40 మంది విద్యార్థులకు అందించిన తర్వాత పాఠశాల అధికారులు దీనిని గమనించారు. అది గమనించిన తర్వాత వడ్డించడం మానేశారు అని పోలీసులు తెలిపారు.
Also Read: Anant- Radhika Wedding: అనంత్ అంబానీ వివాహనికి వచ్చే అతిథులు వీరే..!