PFI Banned :PFIని ఐదేళ్లపాటు నిషేధించిన కేంద్రం..చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటన..!!
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ని చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం 5ఏళ్ళపాటు పీఎఫ్‌ఐపై నిషేధం విధించింది.
- By hashtagu Published Date - 07:11 AM, Wed - 28 September 22

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ని చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 5ఏళ్ళపాటు పీఎఫ్‌ఐపై నిషేధం విధించింది. కేంద్రం విధించిన ఈ నిషేధంలో, సంస్థకు సంబంధించిన అన్ని అనుబంధ సంస్థలు, అన్ని ఫ్రంట్‌లు చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: జమ్మూలో భారీ ఎన్ కౌంట్…ఇద్దరు టెర్రరిస్టుల హతం..!!
PFI దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని..ప్రభుత్వ సంస్థలు గత కొన్ని రోజులుగా సంస్థపై విరుచుకుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన అన్ని సంస్థలపై ఈడీ, ఎన్‌ఐఏ దాడులు నిర్వహించడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మంగళవారం కూడా పిఎఫ్‌ఐపై దాడులు కొనసాగాయి. మంగళవారం ఏడు రాష్ట్రాల్లో స్థానిక పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లు PFI- లింక్డ్ లొకేషన్‌లపై దాడి చేసాయి. దానితో సంబంధం ఉన్న 170 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మందిని విచారణ అనంతరం అరెస్టు కూడా చేశారు. అంతకుముందు గురువారం, NIA నేతృత్వంలో 15 రాష్ట్రాల్లోని 93 చోట్ల దాడులు జరిగిన సంగతి తెలిసిందే.